పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ ఎంపీలు పలు ప్రశ్నలు వేసి కేంద్ర మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు.
తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ
కులఆధారిత గణన పై జీరో అవర్ లో ప్రస్తావించారు. పదిశాతం జనాభా చేతిలో 80 శాతం సంపద ఉంది. అన్ని కులాలను కలుపుకుని పోవాలి. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” సాధ్యం కావాలంటే కుల ఆధారిత గణన జరగాలి. కుల ఆధారిత గణన జరపాలని కోరిన కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అభినందనలు. ఖచ్చితంగా కులాల వారిగా గణన జరగాలని కోరాను.
లావు శ్రీకృష్ణ దేవరాయలు , నర్సరావుపేట ఎంపీ
“డ్రిప్” పథకం కింద కృష్ణా నది పై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లకు మరమ్మత్తులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తాం. సరియైన కాలంలో మర్మత్తులు చేయడం వల్ల రైతులకు ప్రయాజనం చేకూరుతుంది.
నందిగామ సురేష్, బాపట్ల ఎంపీ
కడప జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. రఘురామకృష్ణ రాజు, చంద్రబాబులు ప్రజల నుంచి ఏదో విధంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎవరూ అనని మాటలను అన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.