Cellphone driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక నిబంధనలు అమలులోకి తెచ్చింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ కనిపించేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిప్తారు. వారికి చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదంటోంది కేంద్రం. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్‌ను నేరుగా చేతితో పట్టుకోకుండా ఇయర్‌ఫోన్స్ ద్వారా ఫోన్ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదని ఆయన అన్నారు. లోక్‌సభలో మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వైరల్ అవుతున్నాయి.
Also Read
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
‘‘ఇకపై కారు నడిపే డ్రైవర్ హ్యాండ్ ఫ్రీ డివైజ్‌లను (బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్) ఉపయోగించి ఫోన్లో మాట్లాడితే అప్పుడు దాన్ని నేరంగా పరిగణించలేం. అయితే అప్పుడు ఫోన్ కార్లో పెట్టకుండా డ్రైవర్ జేబులో పెట్టుకోవాలి. దీనికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా జరిమానా విధిస్తే.. దాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది’’ అని గడ్కరీ తెలిపారు.
అయితే మొబైల్ నేరుగా చేతిలో పట్టుకుని ఫోన్ మాట్లాడితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయొచ్చని కేంద్రమంత్రి అన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే వార్తే అయినప్పటికీ.. కొందరు దీన్ని అలుసుగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదంటున్నారు పోలీస్ అధికారులు. ఫోన్ మాట్లాడుతున్నామని చెబుతూనే.. చెవిలో బ్లూటూత్ వంటివి పెట్టుకుని పాటలు వింటూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదం బారిన పడే అవకాశముంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం దుర్వినియోగం కాకుండా చూడాలి.
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..