Netaji Mystery: బ్రిటీష్ లైబ్రరీలో నేతాజీకి చెందిన 62 దస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీయే. అసలు నేతాజీ ఏమయ్యారన్నదానిపై అనేక కథనాలు… ఇంకెన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతకీ నేతాజీ గురించి తెలుసుకోడానికి మనం ఏం చేశాం? ఆ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలించాయనే దానిపై కేంద్రం వివరణ ఇచ్చింది. నేతాజీ గురించి వివిధ దేశాల్లో ఉన్న రికార్డులు, దస్త్రాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేసినట్టు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ఈ విషయం తెలిపారు. ఈ మేరకు పలు దేశాలకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారాయన. సభ్యులు అడిగిన ప్రశ్నకు నేతాజీ మరణంపై అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిపారు కేంద్ర మంత్రి.
నేతాజీకి సంబంధించిన రికార్డులుంటే భారత్‌కు ఇవ్వాలని అమెరికా, బ్రిటన్, రష్యా, జపాన్, చైనాలను కోరామన్నారు. కాగా, నేషనల్ ఆర్కీవ్స్ అండ్ బ్రిటీష్ లైబ్రరీలో 62 దస్త్రాలు అందుబాటులో ఉన్నాయని బ్రిటన్ తెలిపిందన్నారు. తమ వద్ద నేతాజీకి సంబంధించి ఏ పత్రాలూ లేవని రష్యా తెలిపింది. ఇక భారత్ విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా ఆన్వేషించినా… ఏమీ దొరకలేదని వివరించింది. ఇక జపాన్ దగ్గర రెండు దస్త్రాలు ఉండగా… వాటని నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసింది. అంతేకాదు… తమ పరిశీలనలో ఇంకేమైనా లభిస్తే నిబంధనలకు లోబడి వాటిని భారత్‌కు అప్పగిస్తామని స్పష్టం చేసింది జపాన్. తాము 30 ఏళ్లకు మించి చారిత్రక రికార్డులేవి భద్రపర్చబోమని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు… నేతాజీ కాలం నాటి రికార్డులను డిజిటలైజ్ చేయలేదని అమెరికా తెలిపింది.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
నేతాజీ అదృశ్యం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు నియమించిన కమిషన్లలో రెండు… ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్టు ధ్రువీకరించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, జస్టిస్ ఎం.కే ముఖర్జీ నాయకత్వంలోని కమిషన్ మాత్రం నేతాజీ ఆ ప్రమాదంలో చనిపోలేదని నివేదిక ఇచ్చిందన్నారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన అన్ని వాస్తవాలు, పరిస్థితులపై విచారణ చేసేందుకు 1999లో జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నివేదికలో ఓ చోట జపాన్‌లోని ఓ బౌద్ధ ఆలయంలో ఉన్న చితాభస్మం నేతాజీదే కావొచ్చని అన్నారు కేంద్ర మంత్రి. కాగా, జస్టిస్ ముఖర్జీ కమిషన్ నివేదికను నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాలో పొందుపర్చినట్టు సభకు వివరించారు కేంద్ర మంత్రి మురళీధరన్.
భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ప్రపంచ నలుమూలలా గల భారతీయులతో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు సుభాష్ చంద్రబోస్. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారన్నది నేటికీ ఓ మిస్టరీయే. మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక నేతాజీని భారత్‌కు రప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదని కొందరు ప్రశ్నిస్తుంటే… రెండో ప్రపంచ యుద్ధంలోనే విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతున్నారు కొందరు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..