Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగిన సమయంలో బీజేపీ ఎంపీలు త్వరగా తప్పించుకున్నారని అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొంతమంది యువకులు పార్లమెంట్‌లోకి దూరి పొగ విడుదల చేశారని.. బీజేపీ ఎంపీలు వెనక్కి తగ్గారని అన్నారు. బీజేపీ ఎంపీలు పారిపోయారు, ఉంకీ హవా నికల్ గయీ(వారు గట్టిగా భయపడిపోయారు)" అని రాహుల్…
Parliament Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన నిందితులకు మరో 15 రోజుల పాటు అంటే జనవరి 5 వరకు పోలీస్ కస్టడీ పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. స్పెషల్ జడ్జ్ హర్దీప్ కౌర్ నిందితులు కస్టడీని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం దేవీల కస్టడీని పెంచాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు మరో 15 రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Parliament: పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పరంపరం కొనసాగుతోంది. ఈ రోజు మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేష్‌లపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
Parliament security: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు వ్యక్తులు పార్లమెంట్ లోపల, బయట హల్చల్ చేశారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులపై పార్లమెంట్ ఛాంబర్‌లోకి ప్రవేశించి పొగ డబ్బాలను పేల్చారు, మరో ఇద్దరు పార్లమెంట్ బయట ఇదే తరహా చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారితో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.
PM Modi: పార్లమెంటు భద్రత ఉల్లంఘనపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. నిందితులకు ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉందని ప్రధాని మోడీ అన్నారు.
West Bengal CM Mamata Banerjee React on Parliament Security Breach: ఇటీవల పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం అని, పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. విపక్ష పార్టీల కూటమి ఇండియా సమావేశంలో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ నేడు ఢిల్లీ పయనమయ్యారు. ఈ…
Jairam Ramesh React on PM Modi comments on Parliament Security Breach: పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటనపై చర్చించేందుకు ప్రధాని మోడీ ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ అన్నారు. పార్లమెంట్ అలజడిపై చర్చ అవసరమే అని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందనే దానిపై హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు ఇండియా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై…
Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు.
PM Modi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అత్యంత సీరియస్ చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఘటనను తక్కువగా అంచనా వేయవద్దని ప్రధాని అన్నారు. ‘‘ పార్లమెంట్‌లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందువల్ల స్పీకర్ అత్యంత సీరియస్‌గా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని చెప్పినట్లు నేషనల్ మీడియా కథనాలను ప్రచురించింది.
Rahul Gandhi: బుధవారం రోజు, 2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే కొందరు వ్యక్తులు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించారు. విజిటర్ల రూపంలో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్‌లోకి దూసుకెళ్లి, పొగతో కూడిన బాంబుల్ని పేల్చారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ బయట ఇదే తరహా చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది.