అత్యంత భద్రత కల్గిన భారత దేశ పార్లమెంటులో ఆగంతకులు కలకలం సృష్టించిన సమాచారం వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు పోలీసుల వర్గాలు అనుమానిస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దర పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ హాలులో పోగ డబ్బాలను వదిలారు. దీంతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు.
Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కాలంలో భారత్‌ని బెదిరిస్తూ పలు వీడియోల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల భారత పార్లమెంట్ పునాదులు కదిలిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఆ వీడియోలో హెచ్చరించాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్‌పై లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన అప్జల్ గురు ఫోటోను…