BJP: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాల విమర్శలకు అధికార బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయంటూ మండిపడింది. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో వారికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
Parliament security breach: పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి, దాడికి యత్నించిన కేసులో మాస్టర్ మైండ్‌గా చెప్పబడుతున్న లలిత్ ఝాకి ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు 7 ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజులకు పరిమితం చేసింది. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసులకు లొంగిపోయాడు.
Parliament Attack: బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సంఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. అత్యంత భద్రత ఉన్న సెక్యూరిటీని దాటుకుని ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్‌లోకి వెళ్లి స్మోక్ కానస్టర్లను పేల్చడం ఆందోళన రేకెత్తించింది. 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగి డిసెంబర్ 13 తేదీ రోజునే నిందితులు ఈ ఘటనకు ఒడిగట్టారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్ తో పాటు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు…
Parliament Attack: పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించిన ఘటనలో ప్రధాన నిందితులు లలిత్ ఝా, సాగర్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఊహించని విధంగా చోరీ ఘటన జరగడంతో భద్రతా లోపానికి సంబంధించి కూడా దర్యాప్తు ప్రారంభించారు.
Parliament Security Breach: బుధవారం రోజున జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే, నలుగురు నిందితులు పార్లమెంట్ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితులు విజిటర్ పాసులతో పార్లమెంట్‌లోకి వెళ్లారు. సభ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి దూసి ఛాంబర్ వైపు దూసుకెళ్తూ, పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. నలుగురు నిందితులతో పాటు…
Parliament: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అత్యంత పకడ్భందీ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటే పార్లమెంట్‌లోకి విజిటర్ పాసులపై వెళ్లిన ఇద్దరు నిందితులు హంగామా సృష్టించారు. పొగ డబ్బాలను పేల్చి హల్చల్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో నలుగురితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు లలిత్ ఝా ప్రస్తుతం పరారీలో…
నిందితులు నాలుగేళ్ల నుంచి టచ్‌లో ఉన్నట్లు, ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా సమన్వయం చేసుకుని కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ భద్రతా ఉల్లంఘనకు పాల్పడే ముందు పార్లమెంట్‌పై రెక్కీ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Parliament : కొత్త పార్లమెంట్ హౌస్‌లో బుధవారం భద్రత లోపం తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తున్నాయి. కొత్త భవనాన్ని హడావుడిగా నిర్మించారని, పాత పార్లమెంట్ భవనంలో ఉన్నంత భద్రత ఇందులో లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు నిందితులు పార్లమెంట్‌లోకి విజిటర్లుగా ప్రవేశించి, హౌజులో పొగ డబ్బాలను పేల్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.