నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కూలీలు విఫలమయ్యారు. ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారి ప్రయత్నాలను విఫలం చేశారు.
రేపటి(మంగళవారం) నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మారనున్నాయి. పాత పార్లమెంట్ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో సహా కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కాగా.. కొత్త పార్లమెంట్ భవనం మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలకు వేదిక కానుంది.
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన (యూబీటి), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జనతాదళ్ (యునైటెడ్) సహా 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రచ్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదని అన్నారు.
New Parliament Building Latest Pics: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటుంది.. దీనికి సంబంధించిన ఫొటోలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సెంట్రల్ విస్తా ప్రాజెక్టు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది… కొత్త పార్లమెంటు భవనం లోపల ఎలాంటి హంగులు ఉన్నాయో ఆ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.. పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు వివిధ కమిటీల గదులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవన నిర్మాణం…