New Parliament Building Latest Pics: ఆకట్టుకుంటున్న పార్లమెంట్ కొత్త భవనం.. ఈ ఫొటోలు చూసి తీరాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Parliament Building Latest Pics: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటుంది.. దీనికి సంబంధించిన ఫొటోలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సెంట్రల్ విస్తా ప్రాజెక్టు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది… కొత్త పార్లమెంటు భవనం లోపల ఎలాంటి హంగులు ఉన్నాయో ఆ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.. పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు వివిధ కమిటీల గదులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి.. కానీ, ఈసారి బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహిస్తారా? లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..
Read Also: Terror Attack: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై కత్తితో దాడి.. వీడియో వైరల్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మొత్తంగా కొత్త పార్లమెంట్ భవనం లోపల నుండి లేఅవుట్ మరియు కొత్త ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ భవనాన్ని ఈ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. నిజానికి నవంబరు 2022 నాటికే నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది… అయితే, వివిధ కారణాలతో ఆలస్యమైంది. జనవరి చివరి నాటికి ‘సెంట్రల్ విస్తా’ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది, ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం మరియు కమిటీ గదులు ఉన్నాయి. హాళ్లు, కార్యాలయ గదుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. కొత్త పార్లమెంటు భవనం ఎలా ఉందో ఈ కింది చిత్రాల్లో చూడొచ్చు..











తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!