పార్కింగ్ విషయంలో తరచు గొడవలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక తాజాగా ఓ హౌసింగ్ సొసైటిలో పార్కింగ్ కోసం పెద్ద గొడవే జరిగింది. ఈ వివాదం పెద్దది కావడంతో పోలీసులు కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది. అయినా కూడా తగ్గని స్థానికులు పోలీసులపై కూడా దాడి చేశారు.
వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీలో ఆదివారం రాత్రి పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో స్థానికులు గొడవకు దిగారు. చేతికి ఏది దొరికితే దాంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో వారు ఆపే ప్రయత్నం చేశారు.
Also Read: Himachal Floods: వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఏడుగురు.. వీడియో షేర్ చేసిన సీఎం
అయితే ఆగ్రహంలో ఉన్న స్థానికులు పోలీసులపై కూడా దాడి చేశారు. పోలీసులు వారిని వ్యానులో ఎక్కించేందుకు ప్రయత్నించగా వారు నిరాకరిస్తున్న విధానాన్ని మనం వీడియోలో చూడవచ్చు. పోలీసులు కూడా తమపై దాడి చేశారని , తమ ఆడవాళ్ల దగ్గర నుంచి ఫోన్ లు కూడా లాక్కున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Greater Noida West की सोसाइटी में पार्किंग को लेकर विवाद, वीडियो बनाने वाली महिला का पुलिस ने छीना मोबाइल..#gulynews #GreaterNoida #society #Video @noida_authority @noidapolice pic.twitter.com/4lh3j9EWfd
— Guly News (@gulynews) August 14, 2023