Mahesh Babu-Vinesh Phogat: పతకం ముఖ్యం కాదు.. మీరే నిజమైన ఛాంపియన్!
- వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు
- కోట్లాది మంది భారతీయులకు షాక్
- పతకం ముఖ్యం కాదన్న మహేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Supports Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. కానీ ఫైనల్ ముందు ఆమెపై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు గుర్తించి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వినేష్‌కు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మద్దతిస్తున్నారు.
కరీనా కపూర్ ఖాన్, అలియా భట్, ఫర్హాన్ అక్తర్, సమంత రుతుప్రభు, తాప్సీ పన్ను, ఫాతిమా సనాషేక్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండే.. పలువురు వినేష్ ఫోగట్‌కు ధైర్యం చెప్పారు. నవ్వు నిజమైన ఛాంపియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. 1.4 బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read
‘నేటి ఫలితంతో సంబంధం లేదు. కానీ మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది కచ్చితంగా మీ గొప్పతనమే. వినేశ్ ఫొగట్.. మీరొక నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో మీ ధైర్యం, బలం ప్రతిఒక్కరికి స్ఫూర్తి. పతకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు. మీ స్ఫూర్తి మాలోని ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి’ అని మహేశ్ బాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రస్తుతం మహేష్ మేకోవర్ అవుతున్న విషయం తెలిసిందే.
Today’s outcome doesn’t matter, but your greatness in how you coped with the decision does 👏👏👏#VineshPhogat, you’ve shown everyone that your heart is that of a true champion; your resilience and strength to stand tall in difficult times inspires us all.
Medal or not, your…
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!