Paris Olympics 2024: 58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లో అరంగేట్రం.. కల నెరవేర్చుకున్న బామ్మ!
- 58 ఏళ్ల వయస్సులో పారిస్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం
- కల నెరవేర్చుకోవడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన బామ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: చాలావరకు ఎవరైనా పెద్ద వయస్సు వచ్చాకా.. కలలు కనడం మానేస్తారు. వాటిని నెరవేర్చుకోవడం గురించి ఆలోచించడమే మానేస్తారు. ఎవరైనా వయస్సు అయిపోయిన వృద్ధులు పని చేస్తుంటే.. ఇంకా ఈ వయస్సులో ఎందుకు ఆ తంటాలు అని తరచుగా మనం వింటుంటాం. కానీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది జియింగ్ జెంగ్. ఆమె ఎవరో కాదు చిలీ తరపున ఆడిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జియింగ్ జెంగ్. ఆమె తన 58 ఏళ్ల వయస్సులో పారిస్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది. అతిపెద్ద వయస్సులో అరంగేట్రం చేసిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గెలుపు ఓటమిని పక్కన పెడితే ఆ వయస్సులో ఇతర ఆటగాళ్లతో సమానంగా ఆడడం గ్రేట్ అనే చెప్పాలి. పరిస్థితులు ఏమైనా మీ కలలను సాధించకుండా ఆపలేపని ప్రపంచానికి రుజువు చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతిపెద్ద వయస్సు ఉన్న మహిళగా రికార్డు నెలకొల్పింది.
Read Also: IND vs SL: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. శ్రీలంక స్కోరు..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన చిరకాల కోరికను జియింగ్ జెంగ్ ఆలస్యంగా సాకారం చేసుకుంది. చైనాలో జన్మించిన జియింగ్ జెంగ్ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమెకు అంత సులువుగా ఆ అవకాశం దక్కలేదు మరీ. దక్షిణ చైనాలోని ఫోషన్‌లో జన్మించిన జియింగ్ జెంగ్.. స్థానిక టేబుల్ టెన్నిస్ కుమార్తె. చిన్నతనంలో, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ శిక్షణా సమావేశాలకు ఆమె తల్లితో పాటే వెళుతూ ఆ ఆట మీద ప్రేమను పెంచుకుంది. 18 ఏళ్ల వయసులో సొంత దేశమైన చైనా తరపున ఆడాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఒలింపిక్స్ అరంగేట్రానికి ముందే ఆమె తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది.
రెండేళ్ల తర్వాత 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించింది. అనంతరం 20 ఏళ్ల పాటు ఫర్నిచర్ షాప్ నడిపింది. ఆ తర్వాత చిలీలో వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. కొవిడ్ సమయంలో ఆమె తిరిగి టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. కరోనా కాలంలో, జియింగ్ జెంగ్ టేబుల్ టెన్నిస్ ఆడటానికి బానిస అయ్యారు. ఆమెకు మ్యాచ్ ఆడాలనిపించింది. ఆమెకు కుటుంబం కూడా సహకరించింది. ఆమె చిలీలోని ఇక్విక్‌లో ఫెడరేషన్ సహాయంతో ప్రాంతీయ టోర్నమెంట్‌లలో ఆడటం ప్రారంభించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత, 57 ఏళ్ల వయస్సులో 2023 సౌత్ అమెరికన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించారు. 2023 శాంటియాగోలో జరిగిన పాన్ అమెరికన్ గేమ్స్‌లో జియింగ్ జెంగ్ చిలీ యొక్క సంచలన తారగా అవతరించింది. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని సంపాదించింది. మొత్తానికి 2024లో పారిస్ ఒలింపిక్స్‌లో ఆడి తన కలను నెరవేర్చుకుంది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..