పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేష్ కథునియా రజత పతకం గెలుచుకున్నాడు. 42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. భారత్ మరో పతకం సాధించింది. కాగా.. పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా ఎనిమిది పతకాలు సాధించింది.
పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఆదివారం భారత ఆటగాళ్లు రెండు పతకాలు సాధించారు. భారత్‌కు హైజంప్‌లో ఒక పతకం, స్ప్రింట్‌లో ఒక పతకం లభించింది. దీంతో.. భారత్‌కు పతకాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో.. సచిన్ టెండూల్కర్ స్పందిచారు. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన.. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రశంసించారు.
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోఢీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడి వారి కృషిని అభినందించారు. అథ్లెట్లు మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్ మరియు రుబీనా ఫ్రాన్సిస్‌లతో ప్రధాని మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు.
పారాలింపిక్స్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పారాలింపిక్స్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (SH1) ఈవెంట్‌లో భారత షూటర్ అవనీ లేఖరా, సిద్ధార్థ్ బాబు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అవనీ 11వ స్థానంలో నిలవగా, సిద్ధార్థ్ బాబు 28వ స్థానంలో నిలిచాడు.
Paralympics 2024 India Schedule Today: పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం నాలుగు పతకాలు సాధించిన భారత్.. శనివారం ఒక పతకం మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే మరో పతకం దక్కింది. రుబీనా ఫ్రాన్సిస్ కంచు గెలవడంతో పతకాల సంఖ్యను ఐదుకు చేరింది. బ్యాడ్మింటన్‌లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్ నేడు సెమీస్‌లో తలపడనున్నారు. భారీ అంచనాలతో బరిలో దిగిన ఆర్చర్ శీతల్ నిరాశపర్చింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. నేడు భారత్ ఖాతాలో మరిన్ని…
పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఐదో పతకాన్ని అందించింది.
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారుల పతక వేట ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం ఒక్క రోజే నాలుగు పతకాలు ఖాతాలో చేరాయి. ఇందులో ఓ స్వర్ణం కూడా ఉంది. టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్ అవని లేఖరా.. పారిస్‌లోనూ గోల్డ్ గెలిచింది. షూటింగ్‌లోనే మనీశ్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం గెలిచారు. ఇక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పతకం సాధించింది. నేడు కూడా భారత్ ఖాతాలో పతకాలు చేరే అవకాశాలు…
Paralympics 2024: ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్-2024లో భారత్ పతకాల ఓపెన్ చేసింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్థానంలో అవని నిలిచి.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.