ఆఫ్ఘనిస్థాన్‌ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి తాలిబన్లకు ముచ్చెమటలు పడుతున్నాయి… దేశ రాజధాని కాబూల్‌ను సైతం వాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. అమెరికా సైన్యం సైతం కాబూల్‌ను ఖాళీచేయడంతో సంబరాలు చేసుకున్నారు.. అయితే, తాలిబన్లకు పంజ్‌షీర్ లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. పంజ్‌షీర్…అంటే ఐదు సింహాలు అని అర్థం. పేరుకు తగ్గట్టే… పంజ్‌షీర్ ప్రజలు పోరాడుతున్నారు. తమ ప్రాంతంలోకి తాలిబన్లను అడుగు పెట్టనివ్వకుండా… పోరాటం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు… ఈ ప్రాంతాన్ని…
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయినప్పటికీ ఉత్తర భాగంలో ఉన్న పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం తాలిబన్లు పోరాటం చేస్తున్నారు. నిన్నటి రోజున జరిగిన పోరాటంలో 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ ఫైటర్స్ పేర్కొన్నారు. పంజ్‌షీర్ ఫైటర్స్‌కు మాజీ ముజాహిదీన్ నేత అహ్మద్ షా కుమారుడితో పాటు, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నాయత్వం వహిస్తున్నారు. ఆఫ్ఘన్ రద్దుచేసిన సాయుధ సిబ్బందితో పాటుగా, స్థానికి మిలీషియా దళంతో కలిసి తాలిబన్లపై…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది……
తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా…