ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో దేశంలో రాజకీయ వాతావరణం మారింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడతాయని కొందరు భావించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయలేదు. సకాలంలో ఎన్నికలు జరపటానికే మొగ్గు చూపుతూ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య పలు దశలలో పోలింగ్ జరుగుతుంది. మార్చి పదవ తేదీన ఫలితాల వెల్లడితో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమవుతుంది. ఎలక్షన్…
సినీ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎంతో మంది ఈ హెల్పింగ్ స్టార్‌కు ఆరాధ్యులుగా మారారు. కొన్ని చోట్లయితే ఏకంగా గుడులు సైతం కట్టారు. తాజాగా సోనూసూద్ పంజాబ్ స్టేట్ ఐకాన్ హోదా నుంచి స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. Read…
పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. జనవరి 3న మోగాలో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లలో 77 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సాద్-బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపింది. ఆమ్ ఆద్మీ…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ “నేడు సోనూసూద్ దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా మారారు. సహాయం కోసం తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సోను సూద్ సహాయం చేస్తాడు. నేడు పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అలాంటిది సోను సూద్ సాయం చేస్తున్నారు. మేము ఢిల్లీ ప్రభుత్వం చేపట్టబోయే ఓ మంచి…