గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాను బుచ్చి బాబు సన దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం తన లుక్, ఫిజికల్ మేకోవర్‌తో పాటు, పాత్రలో ఒదిగిపోయేందుకు తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్…
హనుమాన్ సినిమాతో ఫ్యాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తేజా, ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి, ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ ఈ సినిమా ఒక వారం వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా అధికారిక సమాచారం రాలేదు, కానీ సెప్టెంబర్…
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ…
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవనం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం జూలై 24, 2025న విడుదలై, భారీ ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు…
సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపు అయింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ల సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ వర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని వాస్తవానికి ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం అమావాస్య ఘడియలు మొదలవడం వల్ల నిన్న రాత్రి ముందుగానే ప్రీమియర్‌లు ప్రదర్శించి సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్‌డ్ టాక్ వినిపించింది. కొంతమంది బాగుందని…
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. Also Read : HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్..…
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి షో మరో రెండు గంటల్లో పడబోతోంది. అయితే హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రాత్రి 9 గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోలకు 700కు పైగా టికెట్ రేట్లు అమ్ముతున్నారు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా సోల్డ్ అవుట్. పెట్టినవి పెట్టినట్లు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు ఆడియన్స్. నిజానికి ముందుగా సింగిల్ స్క్రీన్ మాత్రమే…
హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు మేనియా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అన్న మంగళగిరిలో మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి విశాఖపట్నంలో ఒక ఈవెంట్‌లో హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదిలా…
ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…