గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాను బుచ్చి బాబు సన దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం తన లుక్, ఫిజికల్ మేకోవర్‌తో పాటు, పాత్రలో ఒదిగిపోయేందుకు తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్, రామ్ చరణ్ మేకోవర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
Also Read :Daksha Teaser: ‘దక్ష’ టీజర్ వచ్చేసింది.. పేరు మార్చుకుని వచ్చేసిన మంచు లక్ష్మి!
తాజాగా, ఈ చిత్రంలోని ఒక భారీ పాటను మైసూర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత **ఏఆర్ రెహమాన్** ఈ పాటకు సంగీతం అందించారు. రామ్ చరణ్ పాత్ర పరిచయం కోసం రూపొందించిన ఈ మాస్ పాటలో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాటను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని, ఇది సినిమాకే ప్రధాన హైలైట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది.
వినాయక చవితి పండుగ వాతావరణంలో దేశమంతా మునిగి ఉన్నప్పటికీ, ‘పెద్ది’ బృందం మాత్రం నిరంతరాయంగా షూటింగ్‌లో నిమగ్నమై ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పెద్ది’ చిత్రం మార్చి 27, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.