సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్‌ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్‌లను పొందారు.
సోషల్ మీడియాలో ఎంట్రీతో.. రియల్ ఏది..? వైరల్ ఏది..? అనేది తెలుసుకోవడమే కష్టంగా మారిపోయింది.. దానికితోడు.. సైబర్ నేరగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అన్నట్టుగా.. అన్ని బ్యాంకుల పేర్లతో ఫేక్ మెసేజ్‌లు పంపుతూ.. ఓ లింక్ ఇవ్వడం.. అది క్లిక్ చేస్తూ.. సదరు వినియోగదారుడికి సంబంధించిన సమాచారం మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోవడం జరుగుతూనే ఉన్నాయి.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో కూడా ఇప్పటికే రకరకాల…