Crime news: అత్తింటి కాపురం కత్తి మీద సాము లాంటిది అంటారు మన పెద్దలు. అయితే కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని ఆ అత్తింటి వారినే కత్తులతో పొడిచి కడతేర్చారు ఓ కోడలి తరుపు బంధువులు. ఈ ఘటన పల్నాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా లోని పిడుగురాళ్ల మండలం లోని కొనంకిలో దారుణ హత్య వెలుగు చూసింది. పల్నాడు జిల్లా లోని ముప్పాళ్ళ మండలం దమ్మలపాడుకు చెందిన మాధురికి పిడుగురాళ్ల మండలం కొనంకి చెందిన అనంతం నరేష్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కోటి ఆశలతో అత్తింటిలో అడుగు పెట్టిన మాధురికి తన ఆశలు అడియాశలై అత్తింటి వేధింపులు ఎదురైయ్యాయి.
Read also:Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం.. మళ్లీ నిలిచిపోయిన పనులు
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మాధురి, నరేష్ ల మధ్య కుటుంబ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధురికి అత్తింటి వారి నుండి వేధింపులు ఎక్కువ కావడం చేత పెద్దల సమక్షంలో చర్చించుకునేద్దుకు మాధురి తరుపు బంధువులు కొణంకి వచ్చారు. ఈ క్రమంలో మాధురి అత్తింటి వారికి పుట్టింటి వారికి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడం చేత ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. చినుకు చినుకు కలిసి గాలివానగా మారినట్టు ఇరువురి మధ్య మాట మాట పెరిగి వివాదానికి దారితీసింది. దీనితో అమ్మాయి తరపు బంధువులు విచక్షణ కోల్పోయారు. కూతురు జీవితం నాశనం అవుతుందని కూడా ఆలోచించకుండా కూతురి భర్తను, అత్త మామలను కత్తులతో పొడిచి చంపారు. కాగా ఈ ఘటనలో మరణించిన మృతుల వివరాలు అనంతం నరేష్ (30), ఆదిలక్ష్మి,(50) సాంబయ్య , (56).