Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Bedsheet Turned Into Kurta: భారతీయ రైల్వేలకు చెందిన బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్స్ ఏసీ కోచ్‌ల నుంచి అదృశ్యమవుతున్న ఘటనలు ఎన్నో సార్లు చూస్తూనే ఉన్నాము. అయితే మరోసారి ఈ అంశంపై ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. గత కొన్నేళ్లలో లక్షల సంఖ్యలో రైల్వే బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ కనిపించకుండా పోయాయి. ఈ ఘటనల భారం చివరకు రైల్వే సిబ్బందిపైనే పడుతుండగా.. నష్టాన్ని భర్తీ చేసేందుకు వారి జీతాల నుంచి కోత విధిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌరిహార్ మార్కెట్లో ఓ వృద్ధుడు వెస్టర్న్ రైల్వే లోగో ఉన్న బెడ్‌షీట్‌తో కుట్టించినట్లుగా కనిపించిన తెల్లటి కుర్తా ధరించి తిరుగుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని ఓ కంటెంట్ క్రియేటర్ వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Also Read
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
వీడియోలో సదరు కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ.. “గౌరిహార్ మార్కెట్లో ఈ కాకాను చూడండి.. వెస్టర్న్ రైల్వే బెడ్‌షీట్‌తో చేసిన కుర్తా వేసుకుని ఎంతో హాయిగా తిరుగుతున్నారు” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మొదట తనను వీడియో తీస్తున్నారేమోనని వృద్ధుడు కొద్దిగా అప్రమత్తంగా కనిపించినా, ఆ తర్వాత ఎలాంటి సంకోచం లేకుండా మార్కెట్లో తిరుగుతూ కనిపించాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “రైల్వే ఆప్కీ సంపత్తి హై” అనే మాటను చాచా చాలా సీరియస్‌గా తీసుకున్నాడని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు “ఇదే అసలైన ఫ్యాషన్” అంటూ సరదాగా స్పందించారు. ఇంకొకరు “ఈయనే రైల్వే బ్రాండ్ అంబాసిడర్” అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ముందు రైల్వే ఏసీ కోచ్‌లలో అనధికారికంగా ప్రయాణించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. పాత రైల్వే బెడ్షీట్లను రైల్వే శాఖ వేలం వేస్తుందని, వాటిని కొనుగోలు చేసిన వారు తిరిగి వివిధ వస్తువులుగా తయారు చేసి అమ్మకాలు అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడు ధరించిన కుర్తా కూడా అలాంటి వేలంలో కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌తో తయారై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే వీడియోలో కనిపించిన వృద్ధుడికి వెస్టర్న్ రైల్వే లోగో ఉన్న ఆ బెడ్‌షీట్ ఎలా దక్కింది అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే వీడియోలో కనిపించిన కుర్తా నిజంగా రైల్వే బెడ్షీట్తోనే తయారైందా అనే అంశం కూడా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!