MLA Kolikapudi Srinivasa Rao vs MP Kesineni Chinni: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ నేతలతో మాట్లాడాల్సింది ఏమీ లేదని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు దుబాయ్ నుంచి ఫోన్ చేసి స్పష్టం చేశారు.. అయితే, తాజాగా మరో కీలక పరిణామం…
వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు. వైసీపీ అరాచకాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా మదనపడిపోతుందని ఫైర్ అయ్యారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు ఊరట లభించింది. గాజువాక మెయిన్ రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేతకు బాధ్యులపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యక్షంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అప్పటి డిప్యూటీ సిటీ ప్లానర్ నరేందర్ రెడ్డి, ప్లానింగ్ సూపర్ వైజర్ వరప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వినయ్ ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ…
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలు వేశాం.. మహానాడు నిర్వహణలో 13 కమిటీలు కీలకంగా వ్యవహరించబోతున్నాయి.. ఆ 13 కమిటీల సలహాలు, సూచనలను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీటీఎఫ్ తరపున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మకు టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించాయి. రఘు వర్మకు ఓట్లేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశాయి. అయితే , కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది.
టీడీపీ పొలిట్‌బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు.
నాకు 750 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. 49 ఎకరాలు నా ఆధీనంలో ఉందని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నిరూపించ లేకపోతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుండి వెళ్ళిపోతారా.. పార్టీ మారలేదని కక్షతో చేసారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసాను అని అక్కసుతో వేధిస్తున్నారా. మంత్రి గారు అరెస్టు చేస్తామని…