TDP Politburo Meeting: టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం.. వారికే నామినేటెడ్ పోస్టులు..!
- టీడీపీ పొలిట్‌బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు..
- తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో భేటీ..
- కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి సముచిత స్థానం కల్పించాలని నిర్ణయం..
- పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Politburo Meeting: టీడీపీ పొలిట్‌బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కోసం పని చేసినవారి జాబితా ఇప్పటికే పార్టీకి ఉంది. పార్టీ బలోపేతం కోసం పని చేసిన కార్యకర్తలకు మంచి స్థానం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నాం అన్నారు.. ఇక, పోలవరం, అమరావతి నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ రెండు ప్రాజెక్టులను గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి జరిగే మేలు గురించి చర్చించాం.. కేంద్రం అందించిన సాయంపై పొలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేసిందన్నారు.
Read Also: Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
మరోవైపు.. టీడీపీ హయాంలో పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై చర్చించామన్నారు పల్లా శ్రీనివాస్ రావు.. వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే అంశం మీద మాట్లాడుకున్నామని వెల్లడించారు.. ఇక, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జన్మభూమి-2 త్వరలో ప్రారంభం కాబోతోందన్నారు. జన్మభూమి-2లో ప్రజల భాగస్వామ్యం.. దాతల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేలా ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల్లో వడపోత జరుగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. కూటమిగా గెలుపొందాం.. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ అందరి ఆమోదంతో కూర్పు చేయాల్సి ఉంటుంది. పొత్తుల వల్ల టిక్కెట్లు దక్కని వారికి.. సరైన పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్ పదవుల భర్తీ జరగనుందన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన తొలి జాబితా విడుదల చేస్తాం. చంద్రబాబు నాయకత్వం.. పవన్ కల్యాణ్ పట్టుదల అవసరమని ప్రజలు భావించారు. ప్రజారంజక పాలన సాగిస్తూ.. పార్టీని ప్రభుత్వానికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం. తొలి ఐదు సంతకాలతో చంద్రబాబు ప్రజల్లో గొప్ప నమ్మకాన్ని కల్పించగలిగారని పేర్కొన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?