పసుపు కండువా నీడలోనే నేతలు ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో తెలుగుదేశంపార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం ముగ్గురు నలుగురే ఉన్నారు. వారిలో ఒకరు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. మిగతా వాళ్లు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి.. కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. వీళ్లు మాత్రం పసుపు కండువా నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. బక్కని నర్సింహులు టీ టీడీపీ…
ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక ఆ జిల్లాలోని లోకల్ బాడీ ఓటర్ల ఆశలపై నీళ్లు చల్లిందా? ఇతర జిల్లాల్లోని క్యాంపులు ఈర్ష్యగా మారాయా? పోటీ లేకపోవడంతో పదో.. పాతికో రాకుండా పోయాయని వాపోతున్నారా? వాళ్ల నారాజ్‌కు కారణం ఇదేనా? పోటీ ఉంటే పదో.. పరకో వస్తుందని ఆశించారట..! ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండుకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు పోటీలేకుండా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గులాబీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఓటర్లయిన.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ… కౌన్సిలర్లు మాత్రం నారాజ్‌లో ఉన్నట్టు…
వారంతా ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జిల్లాను కనుసైగతో శాసించారు కూడా. మారిన రాజకీయాలు ఒంటబట్టలేదో.. ఉన్న పార్టీలలో ప్రాధాన్యం తగ్గిందో కానీ.. పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం. వర్తమాన రాజకీయాల్లో ఒంటరి ప్రయాణం! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉద్ధండులైన రాజకీయ నేతలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి రాష్ట్రంలో వారి పేరు ప్రస్తావన లేకుండా పొలిటికల్ డిస్కషన్స్ ఉండేవి కావు. కాలం కలిసి రాలేదో.. మారిన రాజకీయాలకు అడ్జెస్ట్ కాలేకపోయారో కానీ..…