మంత్రాలయం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వాల్మీకి మహర్షి శ్రీరాముని చరిత్ర రాసి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అని తెలిపారు. శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.. శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి చరిత్రలో నిలిచాడు అని ఆయన పేర్కొన్నారు.
ఏరిగేరి గ్రామంలో ప్రజలకు అండగా ఉంటాం.. నేను కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను.. మీకు పక్కా ఇళ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రాలయంలో మూడుసార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి.. మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం కావడంతో సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలను, యువతను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, మహిళలను దగా చేశాడని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో అందరికీ అండగా ఉండాలని నారా లోకేష్ పాదయాత్ర చేసి అనేక సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలని శంఖారావం కార్యక్రమంతో ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
కోసిగి మండలం వందగల్ గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ను ఇంటికి పంపడానికి రాష్ట్రంలో ప్రజల సిద్ధంగా ఉన్నారని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ దే అధికారమని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో…
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని అన్నారు. పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ.. రైతులు,…
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుండి కౌతాళం మండలం హాల్వి గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డును చూసి, నిరసన వ్యక్తం చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి.