కోసిగి మండలం వందగల్ గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ను ఇంటికి పంపడానికి రాష్ట్రంలో ప్రజల సిద్ధంగా ఉన్నారని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ దే అధికారమని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని పాలకుర్తి తిక్కారెడ్డి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు తిక్కారెడ్డి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మంత్రాలయం అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాను అని తిక్కారెడ్డి వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
రైతులకు ఆర్డియస్ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత పాలకుర్తి తిక్కారెడ్డి ది అని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్ఞానేష్, సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి, కోండగేని వీరారెడ్డి, టౌన్ అధ్యక్షులు పంపాపతి, సాతునూరు కోసిగయ్య, వడ్డే రామయ్య, కప్పయ్య,గోపాల్, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, యం పి టి సి సభ్యులు రాజు,చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణా రెడ్డి, పల్లెపాడు మాజీ సర్పంచ్ చంద్ర,సాతునూరు ఉలిగయ్య , వెంకటేష్,మదిరి వీరారెడ్డి, రాగయ్య , మల్లికార్జున రెడ్డి, బసవరాజు,వందగల్ మాజీ సర్పంచ్ నరసింహులు, డీలర్ లింగమూర్తి, నర్సారెడ్డి ,పక్కిరప్ప, హనుమంతు, రోగప్ప, చిన్నారెడ్డి,కర్రప్ప, బెళగల్ సర్పంచ్ రామయ్య, గుండేష్, రంగారెడ్డి , గోపాల్, శ్యామ్ సుందర్,ఉసేని,మారేష్ ,ఐ టిడిపి బృందం సల్మాన్ రాజు, భూంపల్లి నీలకంఠ, కోసిగి హనుమంతు, ఐరన్ గల్ బసవరాజు, పెద్ద భూంపల్లి హనుమంతు,దాదా ఉసేని అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు