Operation Sindoor Effect: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడి మంగళవారం అర్థరాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ప్రారంభమై, కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలకు పెద్ద…