Pakistani Nationals: కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు..
పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది.
దేశంపై యుద్ధం చేసినందుకు ఉరిశిక్ష పడిన ఇద్దరు పాకిస్తానీ పౌరులతో సహా నలుగురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను కలకత్తా హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.