Delhi On High Alert: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు సైరన్ల ఏర్పాటు చేశారు. సైరన్లు మోగించి పౌరులను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
Operation Sindoor : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ vs పాక్ ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక ఎయిర్ వార్నింగ్ వ్యవస్థ అయిన AWACS విమానం భారత వైమానిక దళం చర్యతో కూలిపోయింది. ఇది కేవలం ఓ విమానం నష్టం కాదు, దాయాది దేశానికి వ్యూహాత్మకంగా చెమటలు పట్టించే పరిణామం. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్న చందంగా మారింది. భారత్తో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి పెను శాపంగా పరిణమించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్, ఇప్పుడు నిధుల కోసం ప్రపంచ దేశాల ముందు ఆర్తనాదాలు చేస్తోంది. తొందరపాటుతో యుద్ధానికి దిగిన పాక్, భారత దాడులతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ భాగస్వాములను, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకును…
ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పాక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. 'ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు…