ఇండియా… పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాశ్మీర్ అంశం తరువాత రెండు దేశాల మధ్య మరింత దూరం పెరిగింది. కాగా, సుదీర్ఘకాలంగా మూసుకున్న సరిహద్దులు తిరిగి తెరుచుకోబోతున్నాయి. గురునానక్ జయంతోత్సవాల్లో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరుస్తున్నారు. ఈనెల 17 వ తేదీన ఈ కారిడార్ ను తెరవబోతున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున…
2031వ ఏడాది వరకు జరగనున్న 8 ఐసీసీ టోర్నీలను ఏ ఏ దేశాలు నిర్వహిస్తాయి అనేది నిన్న ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అందులో 2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ హక్కులు పాకిస్థాన్ కు ఇచ్చింది ఐసీసీ. దాంతో ఈ నిర్ణయం పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ చివరిసారిగా 1996లో ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే మాకు ఒక ప్రధాన ఈవెంట్ ను…
పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారం ఉందన్న అహంకారంతో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళా ఇన్స్పెక్టర్ చేసిన ఘోరం మహిళలకే మచ్చతెచ్చింది. అందరు చూస్తుండగా పోలీస్ స్టేషన్ లో మహిళా నిందితురాలి బట్టలు విప్పించి, డాన్స్ చేయించిన దారుణ ఘటన పాకిస్థాన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో షబానా ఇర్షాద్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. క్వెట్టాలోని జిన్నా టౌన్షిప్లో చిన్నారి హత్య కేసు విచారణలో రిమాండ్ కి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏ దేశం ఆ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అయితే, అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో మానవతా దృక్పధంతో ప్రజలను ఆదుకోవడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అందులో ఇండియా ప్రధమంగా ఉన్నది. ఇండియా చొరవతీసుకొని అక్కడి ప్రజలకోసం ఆహారధాన్యాలు ఇతర సహాయ సహకారాలు అందిస్తోంది. ఇతీవలే భారత్ 8 దేశాలతో చర్చలు జరిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానాంశంగా ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిణామాలు, అక్కడి…
ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఆ జట్టు తరపున మొహమ్మద్ రిజ్వాన్ అత్యధికంగా 67 పరుగులు చేసాడు. అయితే ఈ మ్యాచ్ కు ఒకరోజు ముందు ఈ పాకిస్థాన్ క్రికెటర్ ఐసీయూలో ఉన్నాడు. ఆ సమయంలో అతనికి వైద్యం చేసింది ఓ భారత వైద్యుడు. ఐసీయూలో తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్ తో పోరాడిన ఈ పాకిస్థాన్ వికెట్ కీపర్…
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ రెండో సెమీస్ లో పాకిస్థాన్ జట్టుతో ఆస్ట్రేలియా జట్టు తలపడుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టే తన ఫెవరెట్ అని భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు పాకిస్థాన్ అని చెప్పిన ఉతప్ప.. అందుకే వారు ఈ మ్యాచ్ లో తన ఫెవరెట్ అని చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు… ప్రత్యేకంగా…
బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది.…
మలాలా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. 2012 లో పాక్‌లోని స్వాత్ లోయలో స్కూల్ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో తాలిబన్లు బస్సును అటకాయించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మలాలా తలకు గాయమైంది. వెంటనే మలాలాను పెషావర్ తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి బ్రిటన్ తరలించి వైద్యం అందించారు. గాయం నుంచి కోలుకున్న తరువాత మలాలా బాలికల చదువుకోసం పోరాటం చేస్తున్నారు. మలాలా ఫండ్ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పాక్‌లోని…
పాకిస్తాన్లో హిందూవులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఒక్క దేవాలయం కూడా నిర్మించలేదు. పైగా వేలాది దేవాలయాలను కూల్చివేశారు. ఇక ఇదిలా ఉంటే, పాక్‌లో ఇటీవలే ఓ కొత్త ఆలయాన్ని నిర్మించారు. పాక్ సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వం చేత ఆలయాన్ని నిర్మించింది. ఆలయ పునర్నిర్మాణం అనంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ గుల్జార్ అహ్మద్ ఆ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు…