Pakistan: లోయలో పడ్డ బస్సు..11 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న వాహనం జారి లోయలో పడింది. దీంతో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ ఉంటే స్వాత్ లోయ ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలోని సెలయేర్లు, పర్వతాల అందాల చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.
ఈ క్రమంలో వచ్చిన టూరిస్టులు తిరిగి వెళ్తున్న సమయంలో స్వాత్ లోయలోని గాబిన్ జబ్బా సమీపంలోని లాల్కోలోయలో జారి లోయలో పడింది. చనిపోయినవారంతా స్వాత్ లోయలోని మట్టా తాహసీల్ వాసులుగా అధికారులు గుర్తించారు. మరణించిన వారి కుటుంబాలకు ఖైబర్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ కాన్ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Read Also: Hyderabad: యువతి ఆశ చూపించి.. కోటిన్నర కాజేశారు
గతంలో కూడా పాక్ వాయువ్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన ఈ ప్రావిన్స్ లో రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలై నెల మొదట్లో నైరుతి పాకిస్తాన్ లో ప్రయాణికులు బస్సు వర్షాల కారణంగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!