Dalbir Kaur: సరబ్ జిత్ సింగ్ సోదరి కన్నుమూత..పాకిస్తాన్ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరబ్ జీత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ మరణించారు. పంజాబ్ లోని భిఖివింద్ లో ఆమె అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. తన సోదరుడు సరబ్ జీత్ సింగ్ ను పాకిస్తాన్ చెర నుంచి విడిపించేందుకు సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడింది. అయినా పాకిస్తాన్ ప్రభుత్వం సరబ్ జిత్ సింగ్ ను వదిలిపెట్టలేదు. చివరకు అక్కడే మరణించారు. ఈమె కథ ఆధారంగా ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్ లో ‘సరబ్ జిత్’ సినిమాను రూపొందించారు. తన సోదరుడిని పాక్ జైలు నుంచి విడిపించాలని భారత ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది.
పంజాబ్ సరిహద్దుల్లో ఉండే గ్రామంలో నివసించే సరబ్ జీత్, మద్యం సేవించిన తర్వాత భారత్ సరిహద్దు క్రాస్ చేసి పాకిస్తాన్ లోకి వెళ్లాడు. అక్కడ బలగాలు అతన్ని అరెస్ట్ చేశాయి. ఈ ఘటన 1991లో జరిగింది. సరబ్ జీత్ పై గూఢచర్యం నేరాన్ని మోపి పాక్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.
Also Read
సరబ్ జిత్ ను 22 ఏళ్ల పాలు లాహెర్ లోని కోట్ లఖ్పత్ జైలులో ఉంచారు. 2013లో తోటి ఖైదీలు సరబ్ జిత్ పై జైలులో తీవ్రంగా దాడి చేయడంతో తలకు బలమైన గాయాలు కావడం వల్ల ఐదు రోజులు లాహెర్ లోని జిన్నా హస్పిటల్ లో కోమాలో ఉండి మరణించారు. భారత ప్రభుత్వం చాలా సార్లు అతడు గూఢాచారి కాదని పాక్ ప్రభుత్వానికి తెలిపినా.. అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సరబ్ జిత్ అక్క దల్బీర్ కౌర్ 22 ఏళ్ల పాటు తమ్ముడి విడుదల కోసం పోరాడింది.
సరబ్ జిత్ మరణంపై భారత విదేశాంగ శాఖ విచారణ జరపాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దల్బీర్ కౌర్ కూడా సరబ్ జిత్ మరణంపై పాక్ విచారణ చేయాలని.. ఒక వేళ ప్రభుత్వమే ప్లాన్ చేసి ఉంటే విచారణ అవసరం లేదని.. అధికారులకు తెలియకుండా సరబ్ జీత్ ను చంపితే మాత్రం ఖచ్చితంగా విచారణ చేయాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు