Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ధరలు దారుణంగా పెరిగాయి. ఇక ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ఇబ్బదిముబ్బడిగా పన్నులను పెంచింది. దీంతో అక్కడ విద్యుత్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. తాజాగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద డబ్బుల్లేవని వెల్లడించారు.
India at UNHRC: ప్రపంచవేదికలపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, మానవహక్కుల గురించి చెబుతోంది. సమావేశం ఎజెండాతో సంబంధం లేకుండా వీటి గురించి ప్రస్తావిస్తూ భారత్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్స్ ను తిప్పికొడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనది స్ట్రాంగ్ కౌంటర్…
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ మరోసారి భారత్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్ చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. భారతదేశంలో మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరించింది.
Sharada Peeth: హిందూ భక్తుల కోసం కేంద్ర సరికొత్త కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను భారత్ తో కలపాలని భావిస్తోంది. పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠ్ యాత్ర కోసం పీవోకే కారిడాన్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు…
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తోపాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.…
Pakistan: పాకిస్తాన్ లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారిని చంపారు ఉగ్రవాదులు. వాయువ్య పాకిస్తాన్ లో మంగళవారం ఉగ్రవాదులు, అధికారులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ అధికారి హతమవ్వగా.. ఆయన బృందంలోని ఏడుగురికి గాయాలు అయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది నుంచి పాక్ పరిస్థితులు దిగజారడంతో వాయువ్య ప్రాంతం అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పాక్ నుంచి విముక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాదాపుగా రెండు నిమిషాల పాటు బలమైన ప్రకంపలను వచ్చాయి.