Shaheen Afridi 4 Wickets: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన అఫ్రిది.. వైరల్ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani pacer Shaheen Shah Afridi 1st Bowler To Take 4 Wickets In First Over: టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో నాలుగు వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 బ్లాస్ట్ 2023లో అఫ్రిది ఈ రికార్డు నెలకొల్పాడు. నాటింగ్‌హమ్ తరఫున ఆడుతున్న అఫ్రిది.. వార్విక్‌షైర్‌పై 4 వికెట్స్ తీశాడు. అఫ్రిది దెబ్బకు వార్విక్‌షైర్ తొలి ఓవర్‌లో 7 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 7 పరుగులలో 5 రన్స్ అదనపు పరుగులే ఉండడం విశేషం.
టీ20 క్రికెట్‌లో ఓ బౌలర్ తొలి ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. అయితే వన్డే క్రికెట్‌లో శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ ఈ ఘనత సాధించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. దాదాపు 20 సంవత్సరాలు అయినా వాస్ రికార్డును ఎవరూ అందుకోలేదు. తాజాగా టీ20ల్లో షాహీన్ షా అఫ్రిది ఈ రికార్డు నెలకొల్పాడు. 2006లో పాకిస్తాన్‌పై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ టెస్ట్ తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ తీశాడు.
Also Read
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
Also Read: Shreyanka Patil CPL: చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!
షాహీన్ షా అఫ్రిది వేసిన తొలి బంతి వైడ్ కాగా.. బౌండరీ కూడా వెళ్లింది. దాంతో 5 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి అలెక్స్ డేవిస్ (0) ఎల్బీడబ్ల్యూ కాగా.. రెండో బంతికి బెంజమిన్ (0) బౌల్డ్ అయ్యాడు. 3, 4 బంతులకు సింగల్స్ వచ్చాయి. ఇక ఐదో బంతికి మౌస్లే (1) క్యాచ్ ఔటయ్యాడు. చివరి బంతికి బర్నార్డ్ (0) బౌల్డయ్యాడు. దాంతో అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో మొత్తం 4 వికెట్లు వచ్చాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్ అఫ్రిదిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నాటింగ్‌హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. టామ్ మూర్స్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లింటాట్, హసన్ అలీ తలో 3 వికెట్లు పడగొట్టారు. లక్ష ఛేదనలో షాహీన్ అఫ్రిది దెబ్బకు తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు కోల్పోయిన వార్విక్‌షైర్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. రాబర్ట్ ఏట్స్ (65), జేకబ్ బెథెల్ (27), జేక్ లింటాట్ (27 నాటౌట్) రాణించడంతో 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
Also Read: Ravindra Jadeja Rapid Fire: టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!
Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA
— Vitality Blast (@VitalityBlast) June 30, 2023
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!