టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ హాట్ కామెంట్స్ చేశారు. మెగా ఈవెంట్లు సమీపిస్తుండగా.. ఈ పిచ్చి ప్రయోగాలు చేస్తూ.. జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పోలిస్తే.. ప్రెసెంట్ పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉందని అన్నాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ స్టార్ట్ కానుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లలో నిర్వహించనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే టీమ్ ను ప్రకటించింది. అయితే, ఈ ఈవెంట్‌కు ముందు వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది.
Read Also: DPDP Bill – 2023: చట్టంగా మారిన DPDP..
అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్ ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టి.. యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇచ్చింది. అయితే, తొలి మ్యాచ్ ను కష్టమ్మీద గెలిచిన టీమిండియా.. సెకండ్ వన్డేలో ఓడిపోయింది. ఇక మూడో వన్డేలో ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ సహా సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా రాణించడంతో 200 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కానీ.. ఆసియా కప్ లాంటి కీలక ఈవెంట్‌కు ఇలాంటి ప్రయోగాలు ఎందుకనే విమర్శలు వస్తున్నాయి.
Read Also: Stealing Purse: అయ్యో పాపం… పర్స్ కొట్టేయడానికి ట్రై చేసి ఇలా బుక్ అయిపోయాడేంటి..!
ఆసియా కప్, ప్రపంచకప్ ఈవెంట్లకు టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది అని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సర్ఫరాజ్ నవాజ్ అన్నారు. ఈ మెగా ఈవెంట్లకు టీమిండియా సరైన కాంబినేషన్‌ను కూడా సెట్ చేయలేకపోయింది అని విమర్శలు గుప్పించాడు. తరచూ కెప్టెన్లను మారుస్తూ.. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తున్నారు.. అయినా ఇప్పటికీ జట్టు కూర్పుపై అవగాహనకు రాలేకపోయారు అని ఆయన కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే టీమ్ మేనేజ్మెంట్.. భారత క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి బదులు నాశనం చేస్తున్నారనిపిస్తోంది అని సర్ఫరాజ్ నవాజ్ అన్నారు.
Read Also: MP Arvind : కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే
అయితే, సర్ఫరాజ్ నవాజ్ చేసిన కామెంట్లకు టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి.. మా టీమ్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని విమర్శలు గుప్పించారు. కాగా ఆసియా కప్ టోర్నీలో సెప్టెంబరు 2న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ఆడుతుంది.