Veer Chakra winners: భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన దేశ భద్రతా దళాల సైనికులను వారి అసాధారణ ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గుర్తింపుగా వారిని కేంద్రం సత్కరించనుంది. భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’, 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులు లభించాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతదేశం పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్…