Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ యాక్టివ్ అయ్యారు. గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని అన్-నోన్ గన్‌మెన్ హతమారుస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్‌గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా…
ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు అధికారులు సహా పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 11 మంది సభ్యులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్ బాధ్యత వహించింది. పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుర్రం వాయువ్య జిల్లాలో రోడ్డు పక్కన బాంబులు అమర్చి, ఆ తర్వాత కాన్వాయ్ పై కాల్పులు జరిపారని వెల్లడించారు. Also Read:Venus: శుక్ర గ్రహంపై సమృద్ధిగా నీరు.. కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్తలు తెహ్రిక్-ఎ-తాలిబాన్…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ గురువారం బాంబు పేలుడు కారణంగా 9 మంది మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. ఈ సంఘటన వివరాలను పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించిందని డాన్ మీడియా తెలిపింది. ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.
Pakistan: పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు.
Pakistan Terrorist Attack: పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని కారకోరం హైవేపై ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు.
Terrorist Attack : పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు ఇప్పుడు నేరుగా పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై, పోలియో టీకాలు వేసే భద్రతా కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు.