ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు అధికారులు సహా పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 11 మంది సభ్యులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్ బాధ్యత వహించింది. పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుర్రం వాయువ్య జిల్లాలో రోడ్డు పక్కన బాంబులు అమర్చి, ఆ తర్వాత కాన్వాయ్ పై కాల్పులు జరిపారని వెల్లడించారు.
Also Read:Venus: శుక్ర గ్రహంపై సమృద్ధిగా నీరు.. కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్తలు
తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) గా పిలువబడే పాకిస్తానీ తాలిబన్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేసింది. ఈ బృందం ప్రభుత్వాన్ని పడగొట్టి కఠినమైన ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. తాలిబన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అవతల నుండి శిక్షణ పొందుతున్నారని, పాకిస్తాన్‌పై దాడులకు ప్రణాళిక వేస్తున్నారని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.
Also Read:BC Reservations : ఉత్కంఠ పెరుగుతోంది.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
అయితే కాబూల్ ఈ ఆరోపణను కొట్టిపారేసింది. ఇస్లామాబాద్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (CRSS) సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇది గత మూడు నెలల్లో పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు మరియు సైనిక కార్యకలాపాలలో మరణించిన వారి గణాంకాలను అందిస్తుంది. నివేదిక ప్రకారం, ఈ మూడు నెలల్లో కనీసం 901 మంది మరణించారు. 599 మంది గాయపడ్డారు.