పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను భారత్‌లో విలీనం చేస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన ర్యాలీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌తో కలిసి జీవించాలని డిమాండ్ చేస్తారని అన్నారు.
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనుంది. బిల్లులలోని కీలక అంశాలను అమిత్ షా సభకు వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కో ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులు తప్పకుండా హిజాబ్ ధరించి రావాాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై అక్కడి మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ లో పేర్కొంది.
India strong warning to Pakistan and China: దాయాది దేశం పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి మూడో దేశాన్ని ప్రొత్సహించాలని చైనా, పాకిస్తాన్ చూస్తున్న తరుణంలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చీ భారత్ నిర్ణయాన్ని వెల్లడించారు.