India Armenia: భారత స్వదేశీ ఆయుధాల ముందు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, చైనీస్ మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు నిలవలేవనే విషయం ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా ప్రపంచం చూసింది. పాకిస్తాన్ వినియోగించిన టర్కీ, చైనా రక్షణ ఆయుధాలు, వ్యవస్థల్ని భారత్ తుక్కుతుక్కు చేసింది. భారత్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసి వైమానిక రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. ‘‘ఆకాష్’’ సర్ఫేజ్ టూ ఎయిర్ మిస్సైల్స్ అత్యంత ఖచ్చితత్వంలో పాక్ వైమానికి ముప్పుని అడ్డుకున్నాయి. వీటిలో…
PM Modi Speech: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోమవారం ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రసంగం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దానికే బలవుతుందని అన్నారు.
శనివారం ఉదయం భారత్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
Rajnath Singh: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ శుక్రవారం ఉదయం ప్రధాన రక్షణ అధికారి అనిల్ చౌహాన్, త్రిదళాల చీఫ్‌లతో ఢిల్లీలో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ కింద భారత్ చేపట్టిన ప్రతీకార దాడుల అనంతరం ఏర్పడిన భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు జరగనున్నట్లు సమాచారం. Read Also: Indian Army:భారత వైమానిక దళాల కౌంటర్ స్ట్రైక్.. పాక్…
Indian Army : పాకిస్తాన్ నిన్న రాత్రి డ్రోన్ దాడులపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్ డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించాయని, కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పలు సున్నిత ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పాక్ కుట్రలను ముందుగానే గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. LOC వెంబడి పాక్ డ్రోన్ల…