Pak Vs NZ: న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ నేడు డునెడిన్‌లోని యూనివర్సిటీ ఓవల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ లు ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. టిమ్ సీఫర్ట్ 22 బంతుల్లో 45 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో టిమ్ సీఫర్ట్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు. అలాగే, ఫిన్ అలెన్ 16 బంతుల్లో 38 పరుగులు సాధించాడు.
Read Also: Man Of The Match: ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు వీరే
మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పాకిస్తాన్ తరపున కెప్టెన్ సల్మాన్ ఆగా 28 బంతుల్లో 46 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక షాదాబ్ ఖాన్ 26 పరుగులు, షాహీన్ అఫ్రిది 22 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ మరోసారి పాకిస్తాన్‌కు ఆషిలోనే బ్రేక్స్ వేసాడు. డఫీ 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బెన్ సియర్స్, జేమ్స్ నీషమ్, సోధీలు కూడా ఒక్కొక్కరు 2 వికెట్లు తీశారు.
Read Also: RCB Unbox Event: రజత్ పాటిదార్‌పై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ తరపున టిమ్ సీఫర్ట్ 45 పరుగులు, ఫిన్ అలెన్ 38 పరుగులు చేశారు. చివర్లో మిచెల్ హే 16 బంతుల్లో 21 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ అత్యధికంగా 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్‌పై 2-0తో ముందంజలో ఉంది.