Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
Taliban Warning Pakistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉండేది. ఆ స్థాయి నుంచి నేడు బద్ధ శత్రువులుగా మారిన వైనం వరకు వీటి మధ్య పరిస్థితులను గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌పై బాంబులు వేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అనేక మంది ఆఫ్ఘన్ ప్రజలు మరణించారు. దాయాది దాడికి ప్రతిగా ఆఫ్ఘన్…
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.