Taliban Warning Pakistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉండేది. ఆ స్థాయి నుంచి నేడు బద్ధ శత్రువులుగా మారిన వైనం వరకు వీటి మధ్య పరిస్థితులను గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌పై బాంబులు వేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అనేక మంది ఆఫ్ఘన్ ప్రజలు మరణించారు. దాయాది దాడికి ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం దాడి చేసి.. పాక్ ఆయుధాలు, ట్యాంకులను స్వాధీనం చేసుకుంది. తాజాగా తాలిబన్ ఆర్మీ చీఫ్ ఫసిహుద్దీన్ ఫితాత్ ఏకంగా పాకిస్థాన్‌కు బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. చచ్చిపోవాలంటే ఆఫ్ఘన్‌ను రెచ్చగొట్టాలని ప్రకటించారు. ఆఫ్ఘన్లను రెచ్చగొట్టే ఎవరినైనా నిర్మూలిస్తామని బహిరంగంగా ప్రకటించారు.
READ ALSO: Gold Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు !
ఇస్లామాబాద్‌కు గట్టి హెచ్చరిక..
తాలిబన్ ఆర్మీ చీఫ్ ఫసిహుద్దీన్ ఫిత్రాత్ ఇస్లామాబాద్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ చరిత్రను గుర్తు చేశారు. “చరిత్రను తిరిగి చూసుకోండి, మన దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించే ఎవరైనా వదిలి పెట్టిన దాఖలాలు లేవు” అని అన్నారు. దోహాలో పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన ఒక రోజు తర్వాత తాలిబన్ ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పాకిస్థాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ సాయుధ దళాలు తమ సరిహద్దును దాటకుండా నిరోధించే షరతుపై మాత్రమే కాల్పుల విరమణ చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు.
దోహాలో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ ఒప్పందం తరువాత దాయాది సైన్యం, తాలిబన్ల మధ్య రోజుల తరబడి హింసాత్మక ఘర్షణలు ఆగిపోయాయి. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా తాలిబన్ ఆర్మీ చీఫ్ ఫసిహుద్దీన్ ఫిత్రాత్ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్ భూభాగంపైకి దాడులను చేయడానికి ప్రయత్నించే వారు, వారి మూలాలను వాళ్లే తవ్వుకున్నట్లని చరిత్ర చెబుతుంది. భవిష్యత్తులో ఆఫ్ఘన్ భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే ఎవరైనా నిర్ణయాత్మక, వినాశకరమైన ప్రతిస్పందనను ఎదుర్కోవలసి ఉంటుంది” అని హెచ్చరించారు. ఇటీవలి పాక్ సైన్యం దాడిలో ఆఫ్ఘన్ పౌరులు మరణించారని, ఈ విషయంలో ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ విఫలం కాదని ఆయన అన్నారు.
టీటీపీ ఉగ్రవాద సంస్థ కాదు..
తాలిబన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ మాట్లాడుతూ.. TTP ఉగ్రవాద సంస్థ కాదని అన్నారు. పాకిస్థాన్ మాత్రమే రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రత్యర్థులపై ఉగ్రవాద ట్యాగ్‌ను ఉపయోగిస్తుందని చెప్పారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించదని స్పష్టం చేశారు.
గత వారం పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాక్టికా ప్రావిన్స్ పై బాంబు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 10 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి వారం రోజుల ముందే పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి పెరిగాయి. ఈ దాడిపై పాకిస్థాన్ స్పందిస్తూ.. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ లక్ష్యాలపై బాంబు దాడి చేసినట్లు పేర్కొంది. కానీ ఈ దాడిని ఆఫ్ఘనిస్థాన్ తన సార్వభౌమాధికారంపై దాడిగా పేర్కొంది. ఫలితంగా ఏర్పడిన సైనిక ఘర్షణలు దోహా చర్చల తర్వాత ముగిశాయి.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ పోరులో కొత్త ట్విస్ట్! ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన తాంత్రిక పూజారులు..