జమ్మూకాశ్మీర్‌లోని ఉరిలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ దళాలు చొరబాటుకు ప్రయత్నించాయి. దీంతో భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పుల్లో భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ దాడి నుంచి తేరుకోక ముందే పాక్ లో పోలీస్ వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెషావర్‌లోని చమ్కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్‌లోని పశువుల మార్కెట్ సమీపంలో పోలీసు మొబైల్ వ్యాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని ఎస్‌ఎస్‌పి మసూద్ బంగాష్ తెలిపారు. Also…
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్‌ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం అన్నారు.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి గట్టిగా నోటీసు పంపింది. ఈ ఒప్పందం చాలా పాతదని, మార్పులు కోరుకుంటున్నామని పాకిస్థాన్‌కు పంపిన నోటీసులో భారత్ పేర్కొంది.
భారత ఆర్మీ డ్రోన్‌ను పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రోన్ నిఘా డ్యూటీలో ఉంది. సాంకేతిక లోపం కారణంగా.. నియంత్రణ రేఖను దాటింది. ఈ సంఘటన ఈరోజు అంటే 23 ఆగస్టు 2024 ఉదయం 9.30 గంటలకు జరిగింది.
పాకిస్థాన్, చైనాలు కలిసి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న పాక్ ఆర్మీకి ఇప్పుడు చైనా నుంచి సాయం అందుతోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవి కోల్పోయినప్పటి నుంచి వరసగా భారత్ విదేశాంగ విధానాన్ని, పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసిస్తున్నారు.తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ మూడు భాగాలుగా విడిపోయి.. అణ్వాయుధాలు లేని దేశంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఈ దేశం నాశనం అవుతుందని నేను…
ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షలాది మంది తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన అనేక దేశాలు మానవతా దృక్పధంతో ఆహారపదార్ధాలను సరఫరా చేసి ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. ఇండియా నుంచి పాక్ మీదుగా ఈ గోధుమలను సరఫరా చేసేందుకు 5వేల ట్రక్కులను వినియోగిస్తున్నది. ట్రక్కుల్లో గోధుమలను నింపి పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరవేయాలి. Read:…