Pak On Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచ దేశాలు భారత్‌కు అభినందనలు తెలపడంతోపాటు.. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాయి. చంద్రయాన్-3 విజయవంతం కావాలని కోరుకుంటూ ఇప్పటికే బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సందేశాలు పంపగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ మంత్రి సైతం ఇండియా చంద్రయాన్-3 ప్రయోగానికి అభినందనలు తెలుపుతూ.. విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్‌లో లైవ్ టెలీకాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వ్యవహారించిన ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్ మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. మంగళవారం ట్విట్టర్ X లో (గతంలో ట్విటర్‌గా పిలువబడేది)లో షేర్ చేసిన పోస్ట్‌లో ఫవాద్ చౌదరి “పాక్ మీడియా రేపు సాయంత్రం 6:15 గంటలకు చంద్రయాన్ మూన్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి…ప్రత్యేకంగా ప్రజలు, శాస్త్రవేత్తల కోసం మానవ జాతికి చారిత్రాత్మక క్షణం. మరియు స్పేస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియాకి…. చాలా అభినందనలు.” అని పోస్టు చేశారు.
Read Also: Naveen Krishna: పవిత్ర లోకేశ్ అలాంటి వ్యక్తి.. నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు
చంద్రయాన్-3 ల్యాండింగ్ సాయంత్రం 6.04 గంటలకు జరగనుండగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆన్‌లైన్‌లో పాల్గొననున్నారు. ల్యాండింగ్ సమయంలో ఆదివారం చంద్రుని ఉపరితలంపై రష్యా చంద్ర మిషన్ లూనా-25 విఫలమవడంతో ఉత్కంఠ నెలకొంది. 2019 లో, చంద్రయాన్-2 మిషన్ అదే ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విఫలమైంది. ఇది క్రేటర్స్ మరియు లోతైన కందకాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 నుండి నేర్చుకున్న విలువైన పాఠాలన్నీ పరిశీలించుకొన్న నేపథ్యంలో ల్యాండింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో విశ్వాసం వ్యక్తం చేసింది. చంద్రయాన్-3 మిషన్ చంద్రుని తాకడంలో మరియు ఇస్రో యొక్క రెండవ ప్రయత్నంలో రోబోటిక్ లూనార్ రోవర్‌ను ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైతే, అమెరికా తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది.