Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..
- ఆపరేషన్ సిందూర్ నష్టాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీడీఎస్ అనిల్ చౌహాన్..
- జెట్స్ కూలిపోవడం కాదు, అవి ఎందుకు కూలిపోయాయనేదే ముఖ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో నష్టాల గురించి తొలిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ స్పందించారు. నాలుగు రోజులు సంఘర్షణ అణుయుద్ధం స్థాయికి చేరుకోలేని ఆయన చెప్పారు. భారత ఫైటర్ జెట్స్ కూలిపోయాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ విషయం ఏంటంటే, జెట్ కూలిపోవడం కాదు, కానీ అవి ఎందుకు కూలిపోతున్నాయనేదే ముఖ్యం’’ అని ఆయన శనివారం సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్‌లో పాల్గొన్నప్పుడు బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్తాన్ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొన్న వాదనలను పూర్తిగా తప్పు అని ఆయన చెప్పారు. అయితే, భారత్ ఎన్ని జెట్స్ కూలిపోయాయనే దానిపై మాట్లాడటానికి నిరాకరించారు. ‘‘అవి ఎందుకు కూలిపోయాయి, ఏ తప్పులు జరిగాయి, అవి ముఖ్యమైనవి, సంఖ్య ముఖ్యం కాదు’’ అని అన్నారు.
Read Also: MLC Kavitha: దూకుడు పెంచిన కవిత.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఓపెనింగ్..
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఇందులో మంచి విషయం ఏంటంటే, మనం చేసిన వ్యూహాత్మక తప్పిదాలను అర్థం చేసుకోగలుతున్నాము, సరిదిద్దుకోగలుగుతున్నాము. రెండు రోజుల తర్వాత దాన్ని సరిగ్గా అమలు చేయగలము. లాంగ్ రేంజ్ లక్ష్యంగా చేసుకుని మా అన్ని జెట్స్ ని మళ్లీ ఎగరవేయగలము’’ అని చౌహాన్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ కి చెందిన ఆరు జెట్స్‌ని కూల్చేశామని పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై వ్యాఖ్యానించడానికి దూరంగా ఉంది.
అణు యుద్ధాన్ని నివారించడదానికి అమెరికా సహాయం చేసిందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలపై అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించలేదు. పాక్ మోహరించిన చైనా ఆయుధాలు భారత్ ముందు పనిచేయలేదని చెప్పారు. 300 కి.మీ దూరంలోని పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో కొట్టామని ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ భారత్ కన్నా అన్ని విషయాల్లో ముందున్నప్పటికీ, ఇప్పుడు అన్ని విషయాల్లో చాలా వెనకబడి ఉందని సీడీఎస్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ తయారీ ఆకాష్ క్షిపణి వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!