India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
Nawaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్ర పాకిస్తాన్ వందలాది డ్రోన్లతో, క్షిపణులతో భారత్‌పై అటాక్ చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ తరహా పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి, ఆయన సోదరుడు, మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన విధానం అవసరమని సలహా ఇచ్చినట్లు దిఎక్స్‌ప్రెస్…
Asim Munir: ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ..? అనే ప్రశ్న అందరితో మెదులుతోంది. మీడియాలో వస్తు్న్న వార్తల ప్రకారం, ఆసిమ్ మునీర్‌ని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం మాత్రం ఆసిమ్ మునీరే. ఆయన చేసిన విద్వేష ప్రసంగం తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. హిందూ-ముస్లింలు వేరని హిందువుల పట్ల, భారత్ పట్ల ద్వేషాన్ని…
India Pakistan War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలను జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివ్ చేసింది.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్‌ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్‌కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
India Pak War: పహల్గాం ఉగ్రదాడికి అనంతరంగా భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉగ్రవాదంతో యుద్ధంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతో జరగుతున్న ఉగ్రవాదానికి ఇదే సముచిత ప్రతిస్పందన అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద నలుగురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 నిరాయుధ పౌరులు వారి భార్యలు, పిల్లల ఎదుటనే…
Operation Sindoor: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు, ఆ ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజార్‌ని భారత హతం చేసింది. బుధవారం తెల్లవారుజామున పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద కార్యాలయాలు, వాటి శిక్షణా శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో, జైషే టాప్ కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ కూడా…