మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్‌పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని…
Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానికిగా ఉన్న వాజ్‌పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని…
Fans Urge Asia Cup 2025 Boycott Over India vs Pakistan Clashes: 2025 ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో సెప్టెంబరు 14, 21 తేదీల్లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీక ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో జరుగుతాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అవసరమా?, ఆసియా కప్ 2025…
PM Modi: ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయి. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. యాక్సియం-4 మిషన్పై మోడీ ప్రశంసలు గుప్పించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని.. ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. భారత సైనిక పాటవాలను ప్రపంచ…
India Stars Pull Out of India Champions vs Pakistan Champions Match: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా నేడు ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూసీఎల్ 2025లో భారత్, పాక్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దాయాది దేశాలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరగడం డౌటే…
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్‌ఎఫ్ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది.
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
Pakistan: పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.