పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యా రెడ్డి మృతి చెందారు.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరు సరళమైసమ్మ టెంపుల్ వెళ్ళి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళుతుండగా ఇన్నోవా పల్టీ కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి…
ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్…
నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టి.. అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారి కారు ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆనంద్ మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.…
Car Racing: హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్‌లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్‌ఆర్‌పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్‌గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు…
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.
మద్యపానం మన సమాజంలో ఒక సాంఘిక సమస్యగా మారింది, దీని ప్రభావం చాలా తీవ్రమైంది. మద్యం మత్తులో వాహనాలను నడిపించడం అనేది అనేక ప్రమాదాలను పుట్టించటమే కాకుండా, అనేక ప్రాణాలను కూడా బలిగొంటున్నది. ఈ అలవాటు వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
icycles on ORR: ఔటర్ రింగ్ రోడ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై సైకిళ్లు పరుగెత్తనున్నాయి. నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 24 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సోలార్ లూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
Hyderabad Road Accidents: ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ వాసులకు సులభమైన మార్గం. పద్మవ్యూహం వంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మహానగరం నుంచి బయటపడవచ్చని భావిస్తారు.
Hydrabad ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏకు చెందిన ఖాళీ స్థలంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించేందుకు టౌన్‌షిప్‌లు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
Hyderabad outer ring road closure: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. రోడ్డు 2, 7 ఎగ్జిట్ పాయింట్లు నీరు నిలిచిపోవడంతో మూసివేస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రకటించారు.