Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను హైదరాబాద్ మహా నగర్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.
Bengaluru : గార్డెన్ సిటీగా పేరొందిన కర్ణాటక రాజధాని బెంగుళూరు శివారుల్లో రోడ్లపై చిరుతలు సంచరిస్తున్నాయి. ఔటర్ బెంగళూరు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్ అయిన కారువారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ రెండు సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ…
గ్రేటర్ వరంగల్ చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగతా రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్‌కి ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. వరంగల్ రింగ్‌రోడ్డు వెంట, 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు జీవోను కూడా విడుదల చేసింది. ఆఫీసర్లు…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక పంపింది.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్ర సర్కార్.. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.. కేంద్రం ఉత్తర్వులపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.. రాజమండ్రి అభివృద్ధికి కేంద్రం న్యూ ఇయర్ కానుక ఇచ్చిందన్నారు.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరైంది.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి ఉత్తర్వులు…
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్‌ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్‌పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు…
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. ఔటర్ రింగురోడ్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. తాజాగా ఓ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆగి వున్న లారీని ఢీ కొంది ఓట్రక్. దీంతో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్ లో ఇరుక్కుపోయిన క్లీనర్, తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వాహనదారులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక…