TPCC Revanth Reddy for Kantachari Vardhanti Program: తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోందండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి 13వ వర్ధంతి ఈరోజని తెలిపారు. తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ పేర్కొన్నారు. ఉస్మానియా అంటే యువత, ఉద్యమ స్ఫూర్తి ఉన్న విద్యార్థులని పేర్కొ్న్నారు. సమాజానికి చెదలు పట్టినప్పుడు, అధికారం ఆధిపత్యం కోసం ఆలోచించినప్పుడు నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా అంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Read also: Harish Rao: కామారెడ్డిలో మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభిస్తాం
ఎవరు అమరులయ్యారు? ఎవరు ఉద్యమంలో కొట్లాడింది ఎవరు.? జేఏసీలు పెట్టిందెవరు.? జెండాలు కట్టిందెవరు.? అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అధికారం ఆధిపత్యం చెలాయిస్తోంది ఎవరు.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్దలు చెప్పిన మాటను నమ్మి.. తెలంగాణ బిడ్డల పోరాటాన్ని చూసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిసి కూడా సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలకు ఉద్యోగం, పది లక్షలు ఇస్తా అంటే రాజకీయాలకు అతీతంగా మద్దత్తు పలికామన్నారు. అమరుల కుటుంబాలకు నేడు ఎటువంటి సహాయం అందలేదని మండిపడ్డారు. 550మంది కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించిందని, ఇచ్చిన జీవోల్లో అడ్రెస్ నాట్ ఫౌండ్ అని రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.