OU Phd Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలపై వివాదం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OU Phd Admissions: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పీహెచ్‌డీ ప్రవేశాల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఓయూలో గతంలో ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టేవారు. అందులో వచ్చిన మార్కుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు ఇచ్చేవారు. ఈసారి ఈ విధానానికి భిన్నంగా వ్యవహరిస్తామని అధికారులు చెప్పటంతో అభ్యర్థులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
ఈసారి కొత్తగా ర్యాంకులు ఇచ్చి అడ్మిషన్లు చేపట్టనుండటం వివాదానికి దారితీస్తోంది. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఓయూలో నాలుగేళ్ల అనంతరం నోటిఫికేషన్ వెలువడింది. దీంతో పోటీ తీవ్రంగా ఉంది. ఖాళీగా ఉన్న సీట్లలో 50 శాతాన్ని కేటగిరీ-1 కింద భర్తీ చేస్తామని, వీటిని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) అర్హత సాధించినవారికి కేటాయిస్తామని ఓయూ అధికారులు చెబుతున్నారు. మిగతా 50 శాతం సీట్లను పరీక్ష ద్వారా, ర్యాంకులు ఇచ్చి నింపుతామని అంటున్నారు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
Home Work: ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దన్న ఆదేశాలు అమలవుతాయా?
ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తామని పేర్కొంటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) లేదా స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్(స్లెట్)తోపాటు ఎంఫిల్, ఇంటర్వ్యూ తదితర దశల్లో వచ్చిన మార్కులకు మిగతా 30 శాతం వెయిటేజీ ఇస్తామని ఓయూ అధికారులు వివరిస్తున్నారు. ఈ విధానం పట్ల విద్యార్థులు విముఖత ప్రదర్శిస్తున్నారు. పాత పద్ధతిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఇవ్వటంలో ఇప్పటికే నాలుగేళ్లు జాప్యం చేసిన అధికారులు ఇప్పుడు ప్రకటన జారీ చేసినప్పటికీ అడ్మిషన్లను మరింత ఆలస్యం చేసేందుకే రూల్స్ మార్చారని మండిపడుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు సైతం తమకు ప్రత్యేకంగా సీట్లు సృష్టించాలని కోరుతున్నారు. నెట్/స్లెట్ అర్హత ఉందని, అందుకే సూపర్ న్యూమరరీ కింద సీట్లు కేటాయించాలని అడుగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఇప్పటికే పీహెచ్‌డీ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసి వచ్చే నెలలో ఎగ్జామ్ పెట్టేందుకు రెడీ అవుతోంది. మరోవైపు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కూడా ప్రవేశ ప్రకటనకు సంసిద్ధమవుతోంది. ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే అర్హులైన ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ గైడ్‌షిప్ ఇవ్వాలని భావిస్తోంది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!